టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో పట్టుబడ్డ ఆరు కేజీల గంజాయి
6 kg ganja seized during the inspection by the Task Force police
ఇద్దరు మహిళల అరెస్టు
జమ్మికుంట మండలంలోని కొత్తపల్లిలో విశ్వాసనీయమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా. అనుమానాస్పదంగా మహిళా కనబడడంతో తనిఖీ చేయగా ఆమె వద్ద గంజాయి లభ్యమైందన్నారు.ఈ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వారు తెలిపారు.
దొరికిన గంజాయి విలువ సుమారు రూ ఒక లక్ష 75 వేల ఉంటుందని టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సిఐ కే. నాగేశ్వరరావు తెలిపారు. మహిళలను అదుపులోకి తీసుకొని పట్టుబడ్డ ఆరు కేజీల 366 గ్రాముల గంజాయి వారి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.ఈ తనిఖీలలో ఎస్సై ఎన్.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మోసిన్, కానిస్టేబుల్స్ కుమార్, కమలాకర్, కాసింబి ఎక్సైజ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.