A place where you need to follow for what happening in world cup

వెనక సీట్లో మహిళా కస్టమర్.. కారు నడుపుతూ ఉబెర్ డ్రైవర్ గలీజ్ పని

  • ఆస్ట్రేలియాలో మహిళకు చేదు అనుభవం
  • వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
  • నాలుగు వారాల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
  • స్పాట్ లోనే డ్రైవర్ ను తొలగించిన ఉబెర్ కంపెనీ

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కారు బయలుదేరిన వెంటనే సదరు డ్రైవర్ ప్యాంట్ విప్పి మాస్టర్ బేషన్ చేసుకోవడం మొదలు పెట్టడంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు లోనైంది. చుట్టూ ట్రాఫిక్ ఉన్నా, వెనక సీట్లో తాను కూర్చున్నా కూడా గలీజ్ గా ప్రవర్తించడంతో ఏంచేయాలో తెలియక ఆందోళన చెందింది. తర్వాత సదరు డ్రైవర్ చేస్తున్న పాడు పనిని వీడియో తీసి, ఇంట్లో ఉన్న తల్లికి విషయం చేరవేసింది.

ఒంటరిగా ఉండడంతో డ్రైవర్ ను నిలదీసే ప్రయత్నం చేయలేదని, ఇంటికి చేరుకున్నాక అటు ఉబెర్ కంపెనీకి, ఇటు పోలీసులకు సమాచారం అందించానని తెలిపింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీకి చెందిన టేలా పిమ్లాట్ (26) అనే మహిళకు ఎదురైన అనుభవమిది. ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించిన వివరాలు, ఆస్ట్రేలియా న్యూస్ డాట్ కామ్ వెబ్ సైట్ కథనం ప్రకారం..

టేలా పిమ్లెట్ ఇటీవల ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారులో కూర్చున్నాక కాసేపటికి డ్రైవర్ ప్రవర్తన అసహజంగా అనిపించింది. సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి చూడగా.. స్టీరింగ్ ముందు కూర్చున్న డ్రైవర్ ఒక చేత్తో కారు నడుపుతూ మరో చేత్తో మాస్టర్ బేషన్ చేసుకుంటున్నాడు. పట్టపగలు.. చుట్టూ ట్రాఫిక్, వెనక సీట్లో ఓ మహిళ ఉందన్న జ్ఞానం లేకుండా డ్రైవర్ చేస్తున్న పనికి పిమ్లెట్ కు చిరాకు తెప్పించింది.

ఆపై తాను ఒంటరిగా ఉన్నానని గుర్తొచ్చి భయాందోళన చెందింది. గట్టిగా అరిచినా, నిలదీసినా డ్రైవర్ తనపై అఘాయిత్యం చేయొచ్చని భయపడింది. దీంతో వెంటనే తన తల్లికి, బాయ్ ఫ్రెండ్ కు మెసేజ్ ద్వారా విషయం చేరవేసింది. ఆపై తన ఫోన్ లో డ్రైవర్ నిర్వాకాన్ని రికార్డు చేసింది. ఇంటికి చేరుకున్నాక తల్లి సాయంతో డ్రైవర్ ను నిలదీద్దామన ప్రయత్నించినా తర్వాత మనసు మార్చుకుంది. వెంటనే ఉబెర్ కంపెనీకి, పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. సదరు డ్రైవర్ ను రహ్మన్ ఫాజెలిగా గుర్తించిన ఉబెర్ వెంటనే అతడిని సంస్థలో నుంచి తొలగించినట్లు ప్రకటించింది. పోలీసులు రహ్మాన్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం నాలుగు వారాల జైలుశిక్ష విధించింది.

Leave A Reply

Your email address will not be published.