ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు
4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం
బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు
2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లుగా చెప్పుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో.. రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ.. ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయి తీలను బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసా యంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, తయారీ పరిశ్రమ లకు ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు. పన్నుల శ్లాబుల విషయంలో పెద్ద ఊరట లేనప్పటికీ.. స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతు న్నట్లు ప్రకటించారు.
స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని 50 శాతం పెంచినట్లయ్యింది. దీంతో రూ.17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను భారం లేదు. రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను, రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను పడనుంది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్‌కు సంబంధించిన మూడు రకాల ఔషధాలను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా ప్రకటించారు. దీంతో మూడు రకాల ఔషధాలు తక్కువ ధరకు లభించనున్నాయి. మహిళలు, బాలికలకు లబ్ది చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు చేపట్టారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్‌లో డార్మిటరీ వసతి సౌకర్యం తీసుకుని వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ ప్రకటించారు. బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు చేపట్టారు.
పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం దక్కనుంది. బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ప్రకటించారు. 5 రాష్టాల్ల్రో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కానుంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్ర దేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం దక్కనుంది.ఈశాన్య ర్లాష్ట్రాలో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు కానున్నాయి. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోము ఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు కానుంది. దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానంతో పాటు, గ్రాణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు జరిగింది.
ప్రతి సంవ త్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజే యడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ దక్కనుంది. అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం ఇచ్చారు. రూ.26వేల కోట్ల వ్యయ ంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న లక్ష కంటే తక్కువ జీతం ఉన్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహా యం చేస్తారు. గ్రాణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.