A place where you need to follow for what happening in world cup

కొట్లాడి తెచ్చుకుని..వాయిదా వేయమంటారా..?

పదేళ్లు ఉద్యోగాల కోసం కొట్లాడిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్‌ ‌సెంటర్ల నిర్వాహకులు ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం రెచ్చగొడుతున్నాయని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొందరు ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. గ్రూప్‌ ‌వన్‌లో వన ఈస్ట్ ‌వంద చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించడానికి అబ్యంతరం లేదని, కానీ ఈ పక్రియ చేపట్టగానే కోర్టు నోటిఫికేషనే కొట్టేస్తుందని అన్నారు. ఇది నిరుద్యోగ యువత గుర్తించాలని అన్నారు. ఇచ్చిన హావి• మేరకు త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ను తీసుకుని రాబోతున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్‌ ‌ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాలిటీ విద్యపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ ‌విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్‌లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్‌ ‌సిలబస్‌లు ఉన్నాయని అన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్‌ ‌స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్ప.. వారిలో పనితనం ఉండట్లేదని ఆయన అన్నారు. అంటే ఏటా లక్షమంది నిరుద్యోగులు వొస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడే విధంగా టెక్నికల్‌ ‌కోర్సులు సిలబస్‌ ‌మారాలని రేవంత్‌ ‌రెడ్డి కోరారు. ప్రభుత్వానికి భేషజాలు లేవని, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదనేదే తమ ప్రభుత్వ విధానమని వివరించారు. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనని…సివిల్‌, ‌మెకానికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌కోర్సులను ప్రస్తుతం కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షేమమే ఫస్ట్ ‌ప్రియారిటీగా ఉందని, ఆ తర్వాతే అభివృద్ధి అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్‌ ఏఐ ‌సమ్మిట్‌ ‌హైదరాబాద్‌ – 2024 ‌లోగోను విడుదల చేశారు.

ఇక ఇంజనీరింగ్‌ ‌కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫాక్టరీలుగా ఉండకూడదని సిఎం సూచించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ ‌చెల్లించలేదని.. ఈ అకాడమిక్‌ ఈయర్‌ ‌నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ ‌చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ ‌తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నాడు ఐడిపిఎల్‌ను ఇందిరా గాంధీ పెట్టడం వల్లే నేడు ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్నారు. ఆ తరవాత హైదరాబాద్‌లో ఫార్మా రంగం బాగా అభివృద్ది చెంది, కోవిడ్‌ ‌టీకా ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైంది సివిల్‌ ఇం‌జినీరింగ్‌ అని, కొన్ని కళాశాలల్లో సివిల్‌ ఇం‌జినీరింగ్‌ను లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని, కళాశాలల్లో సివిల్‌, ‌మెకానికల్‌, ఎలక్టిక్రల్‌ ‌కోర్సులను కచ్చితంగా నడపాలని సిఎం సూచించారు. ఈ కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కుంటుందని హెచ్చరించారు.

image.png

గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలని, ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతుందన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం కూడా అందుకు ప్రోత్సహిస్తుందని, త్వరలోనే స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేసి అటానమస్‌ ‌హోదా ఇస్తామని సిఎం తెలిపారు.

ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనం తయారు కావాలని, తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సీఎం వివరించారు. 2030 నాటికల్లా ఐటీ రంగంలో కర్ణాటకని అధిగమిస్తామని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. మంచి సలహాలు ఇస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌ ‌బాబు విద్యావేత్తలను కోరారు. రాబోయే రోజుల్లో సాప్ట్ ‌వేర్‌ ‌రంగంలో మనమే ముందుంటామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. జేఎన్‌టీయూ వీసీ బుర్రా వెంకటేశం, ఇంజినీరింగ్‌ ‌కాలేజీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.