- చేరికల పర్వం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికె బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరగడంతో తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ప్రస్తుత శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను ప్రకటించి సుమారు రెండు నెలలు కావస్తుంది. నాటి నుండి జోరుగా ప్రచార పర్వం నిర్వహిస్తున్న శాసనసభ్యుడు ఒకపక్క ప్రచారం చేసుకుంటూ మరోపక్క విపక్ష పార్టీల నుండి చేరికలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు.ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలానికి చెందిన మిర్యాల గ్రామ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే నివాసంలో నేడు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నియోజకవర్గంలోని విపక్ష పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు ఒకరిద్దరు జెడ్పిటిసిలతో పాటు పలు గ్రామ ,మండల శాఖల నాయకులను ముఖ్య కార్యకర్తలను అధిక శాతం ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు .దీంతో టిఆర్ఎస్ బలం గత ఎన్నికల కన్నా మరింత పెరిగిందని చెప్పవచ్చు . రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా మెజార్టీ రాకపోవడంతో ఈసారి ఎలాగైనా అత్యధిక మెజార్టీ సాధించాలని పట్టుదలతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు .ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీల నుండి పలువురు నాయకులను కార్యకర్తలను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు ఎవరో తేలక సతమతమవుతున్న అవుతున్న విపక్ష పార్టీలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
విపక్షాల నుండి పోయే వారిని ఆపేవారు లేకపోవడంతో బి ఆర్ ఎస్ పార్టీ వ్యూహం అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతోంది .అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన రోజు కోడ్ అమల్లోకి వచ్చే సమయానికి ముందే తుంగతుర్తి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు .కోడ్ సమయం తర్వాత తన పర్యటన నిలిపివేశారు .ఒకటి రెండు రోజుల్లో మండలాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనునట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏ మండలంలో ఏ తేదీలను ప్రచారానికి ప్రకటించాలో అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ఎమ్మెల్యే ఇకముందు చేసే పర్యటన ఎన్నికల నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు.
ప్రచార పర్వంలో మరింత దూకుడు పెంచడానికి ఎమ్మెల్యే సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో భారీ సమావేశాల ఏర్పాటు లాంటి కార్యక్రమాలను కూడా రానున్న రోజుల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది .ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రచార పర్వం ప్రస్తుతం నియోజకవర్గంలో ఏకపక్షంగా అప్రతిహతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.9 విపక్ష పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచార పర్వంలోకి దియేసరికి మరో వారం రోజులు పడుతుందని మాట వినవస్తోంది .వచ్చే అభ్యర్థులు ఎవరో అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొనగలరా అధికార పార్టీ దూకుడును నిలువరించగలరా ?⁸లేక అధికార పార్టీ అభ్యర్థి దూకుడుకు ఏ విధమైన సమాధానం ఇస్తారు వేచి చూడాల్సిందే.