A place where you need to follow for what happening in world cup

బీసీ కమిషన్ సభ్యుడిగా తిరుమలగిరి సురేందర్

  • సీనియర్ జర్నలిస్టుకు గౌరవం
  • మీడియా అకాడమీ పూర్వ అధ్యక్షుడిగానూ అనుభవం
  • కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ముద్ర
  • మాజీ సీఎం లకు సన్నిహితుడు
  • మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగానూ ఎనలేని కృషి 
  • సోమవారం బాధ్యతల స్వీకరణ

సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడు అయిన తిరుమలగిరి సురేందర్ ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షుడిగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సురేందర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేశారు.జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచడానికి పలు కార్యక్రమాలను అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కీలక సూచనలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్యలకు, సీనియర్ నేతలైన డి. శ్రీనివాస్, జానారెడ్డి వంటి నేతలకు అత్యంత సన్నిహితుడిగా సురేందర్ పేరు తెచ్చుకున్నారు.

ఈనాడు, ఆంధ్రభూమి దిన పత్రికల్లో నాలుగు దశాబ్థాల పాటూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల బయోగ్రఫీ రాశారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర పైన ఒక పుస్తకం రాశారు. ప్రస్తుతం తెలంగాణ వార్త ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకం ఒక సంచలనం..

ఉమ్మడి రాష్ట్రంలో మీడయా అకాడమీ చైర్మన్ గా తిరుమలగిరి సురేందర్ నియామకమే ఒక సంచలనం అని చెప్పవచ్చు. అకాడమీ కేంద్రంగా యుూనియన్ రాజకీయాలు చేస్తూ పైరవీలు చేసుకుంటూ బతికిన వారికి మొదటిసారి కొణిజేటి రోశయ్య చెక్ పెట్టారు. అప్పటి వరకూ అగ్రకుల జర్నలిస్టులనే చైర్మన్ లుకా నియమించగా మొదటి సారి బీసీ జర్నలిస్ట్ సురేందర్ ను ఈ పదవికి ఎంపిక చేశారు. దీనిని కొందరు జీర్ణించుకోలేక పోయారు. అడుగడుగునా సహాయ నిరాకరణ చేశారు. అయినా వారిని సురేందర్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సురేందర్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం తెరపైకి వచ్చింది.

కొందరు యుూనియన్ నేతలు సురేందర్ పదవీ కాలాన్ని పొడిగించవద్దని కోరారు. అయినప్పటికీ వారి మాటలను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. సురేందర్ బాగానే పనిచేస్తున్నారని కితాబు నిచ్చారు. జర్నలిజానికి, కాంగ్రెస్ పార్టీకి సురేందర్ చేసిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర సంస్థకు సభ్యుడిగా నియమించడం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని, బీసీల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని సురేందర్ తెలిపారు. సోమవారం కమిషన్ కార్యాలయంలో సురేందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.