- దూకుడు పెంచుతున్న బీఆర్ఎస్ పార్టీ
- ఇన్ఛార్జీలతో వర్చువల్ గా సమావేశమైన కేటీఆర్, హరీశ్
- ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి గడపకు వెళ్లి వివరించాలని సూచన
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్… తాజాగా 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా వారు చెప్పారు. ప్రతి గడపకు వెళ్లి… ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు:
- కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
- నిజామాబాద్ అర్బన్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- జగిత్యాల – ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్
- రామగుండం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
- మంథని – ఈద శంకర్ రెడ్డి
- పెద్దపల్లి – రవీందర్ సింగ్
- జనగామ – మాజీ ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు, రాజయ్య, మంత్రి హరీశ్‌రావు
- మహబూబాబాద్ – మంత్రి సత్యవతి రాథోడ్
- నర్సంపేట – వీ ప్రకాశ్
- వరంగల్ ఈస్ట్ – మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
- భూపాలపల్లి – ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
- ములుగు – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
- ఇల్లందు – ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- మధిర – మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వర్ రావు
- వైరా – ఎంపీ నామా నాగేశ్వర్ రావు
- చొప్పదండి – మంత్రి గంగుల కమలాకర్
- వేములవాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
- మానకొండూరు – సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ
- మెదక్ – కే తిరుపతి రెడ్డి
- ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్
- నర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంకటరాం రెడ్డి
- జహీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్రసాద్
- సంగారెడ్డి – వీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్
- బెల్లంపల్లి – ఎంపీ వెంకటేశ్ నేత
- మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్రసాద్
- ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠల్
- బోథ్ – మాజీ ఎంపీ నగేశ్
- ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
- బోధన్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్
- దుబ్బాక – బాలమల్లు
- గజ్వేల్ – మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ప్రతాప్ రెడ్డి
- మల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
- ఉప్పల్ – రావుల శ్రీధర్ రెడ్డి
- ఇబ్రహీంపట్నం – మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి
- చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి
- వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి
- ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్
- అంబర్‌పేట్ – కట్టెల శ్రీనివాస్ యాదవ్, అడ్వొకేట్ మోహన్ రావు
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మక్తల్ – ఆంజనేయులు గౌడ్
- గద్వాల్ – రాకేశ్ చిరుమళ్ల
- అలంపూర్ – ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి
- అచ్చంపేట – ఇంతియాజ్ ఇషాక్
- కల్వకుర్తి – గోలి శ్రీనివాస్ రెడ్డి
- కొల్లాపూర్ – ఎంపీ రాములు
- నాగార్జునసాగర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామచంద్ర నాయక్
- హుజూర్ నగర్ – విజయసింహా రెడ్డి
- కోదాడ – ఎమ్మెల్సీ టీ రవీందర్ రావు
- నల్లగొండ – జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి
- నకిరేకల్ – ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
- సత్తుపల్లి – ఎంపీ పార్థసారథి రెడ్డి
- అశ్వారావుపేట – శేషగిరావు (ఖమ్మం డీసీఎంఎస్)
- భద్రాచలం – ఎమ్మెల్సీ తాత మధు.