A place where you need to follow for what happening in world cup

మున్సిపల్ వార్డులలో అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన పెంచుకోవాలి

మున్సిపల్ వార్డులలో అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ కృష్ణారెడ్డి మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు, మున్సిపల్ చట్టం, మున్సిపల్ అభివృద్ధి పనుల నిర్వహణపై ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టరు మాట్లాడుతూ 2019 తెలంగాణ పురపాలక చట్టంపై వార్డు ఆఫీసర్లు అవగాహన పెంచుకోవాలని, చట్టంలో పేర్కొన ప్రకారం ప్రతి ఒక్క మున్సిపల్ వార్డుకు ఒక వార్డు ఆఫీసరును నియమించడం జరిగిందన్నారు. వార్డులలో ఏ సమస్య వచ్చినా మీరు బాధ్యతతో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకార సమన్వయంతో పనులు నిర్వహించాలని, వార్డులలో అభివృద్ధి మీ బాధ్యత అన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మున్సిపల్ వార్డులలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పారిశుద్య రంగంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఇంటి నుండి వంద శాతం తడి పొడి చెత్త వేరుగా సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అన్ని ప్రభుత్వ ప్లేసులలో పారిశుద్య పనులు చేపట్టాలని, ప్రతి ఇంటికి నల్లా ఉండేలా చూడాలని, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా పరిశీలించాలని, పైపులైన్ లీకేజీ సమస్యలను గుర్తించి. పునరుద్దరించాలని, వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడరుతో రెగ్యులర్ గా క్లోరినేషన్ చేయించాలని, క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పర్యవేక్షణ ఉండాలని అన్నారు. వార్డులలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని, ఖాళీ స్థలం చిన్నదైనా మొక్కలు నాటాలని, ప్రభుత్వ ఆఫీసు కార్యాలయాల చుట్టూ ప్లాంటేషన్ చేపట్టాలని, పట్టణ ప్రకృతి వనాల కోసం చిన్నదైనా సరే ఏర్పాటు చేయాలని, వాటరింగ్ ముఖ్యమని, మొక్కలు బతికేలా చూడాలని, 85 శాతం మొక్కల సంరక్షణ ముఖ్యమని మున్సిపల్ నర్సరీలు, ట్రీ పార్కులు, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ పనులను చేపట్టాలని, 10 శాతం గ్రీన్ బడ్జెట్ ను పూర్తిగా పచ్చదనం పెంపునకు వినియోగించాలని అన్నారు.

వార్థులలో మురికి కాలువల పారిశుద్య పనులు పర్యవేక్షించాలని, అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని, ఫాగింగ్ పనులు, దోమల నిర్మూలన, సింగిల్ యూజ్ పాస్టిక్ నిషేధం పనులను పర్యవేక్షించాలని, వార్థులలో ఆసరా పెన్షన్ దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలని, సిసి రోడ్లు, డ్రైనేజీల పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల మీయొక్క పనితీరు మెరుగ్గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రముంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జి.వీరారెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, చౌటుప్టల్ మున్సిపల్ కమిషనర్ భాస్కరరెడ్డి, ఆలేరు మున్సిపల్ కమిషనర్ చక్రపాణి వార్డ్ ఆఫీసర్లకు మున్సిపల్ చట్టం, అభివృద్ధి కార్యక్రమాల అమలు పట్ల అవగాహన కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.