తెలంగాణ పోలీస్ సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్‌సభ సెక్రటేరియట్ సీనియర్ అధికారుల బృం దం ప్రశంసించింది. చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మీడియా మేనేజ్‌మెంట్, డిజిటల్ పీఆర్ సామర్థ్య నిర్వహణపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని ప్రభుత్వశాఖల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ పీఆర్ మేనేజ్‌మెంట్ ప్రజలకు అత్యంత చేరువలో ఉన్నదని లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులు కితాబిచ్చారు.సామాజిక మాధ్యమాల్లో తమకున్న పరిమితులతో చట్టబద్ధంగా ప్రజలకు సరై న అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల సోషల్‌మీడియా, పీఆర్ మేనేజ్‌మెంట్‌పై బృందానికి రాష్ట్ర అధికారులు పలు విషయాలను తెలియజేశారు. ‘ప్రతి ఠాణా కు సామాజిక మాద్యమాల్లో ఖాతా తెరిచి వాటి ద్వారా స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తున్నాం.
ప్రజలకు పోలీసులు చేరువ కావడానికి వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ, చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల గచ్చిబౌలీ మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో జంక్షన్‌లో ఒక వైపు రోడ్డు పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది.సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించాం. ఐటీ ఉద్యోగుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తీసుకొని తగిన ఏర్పాట్లు చేశాం. నేరం చేస్తే ఎలాంటి శిక్షలు పడుతాయన్నదానిపై డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తు న్నాం. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రజల్లో వ్యక్తిగత సమాచార భద్రత ఎం త వరకు సురక్షితం అన్న అంశంపై చర్చ మొదలైంది. దీన్ని గుర్తించిన కేంద్రం వెంటనే పార్లమెంట్‌లో డాటా ప్రొటెక్షన్ బిల్లు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సోషల్‌మీడియా అత్యంత ప్రభావితంగా ఉపయోగించుకోవటం వల్లే ఈ అద్భుతాలు జరిగాయి’ అని వివరించారు. లోక్‌సభ సెక్రటేరియట్ అధికారుల బృందం ఈ అంశాలపై ఆసక్తి ప్రదర్శించింది.