- బండి” ఇంటి ముందు ముస్లింల హల్ చల్రె
- చ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ర్యాలీ
- పోలీసుల నిర్లక్ష్యం అంటున్న బిజెపి శ్రేణులు
- దీటుగా స్పందించిన బిజెపి కార్యకర్తలు
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఇంటి ముందు ముస్లిం యువకులు హల్ చల్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సంజయ్ ని దూషించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన మిలాద్ ఉన్ నబీ రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తూ వేడుక జరుపుకుంటారు. ఈ ర్యాలీలు ముస్లింల నివాస ప్రాంతాల్లో, ప్రధాన రహదారుల వెంట ర్యాలీ తీస్తూ ఒకరికొకరు ఆత్మీయతను పంచుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా కొంతమంది యువకులు బండి సంజయ్ ఇల్లు, పార్లమెంటు కార్యాలయం ముందు నుండి ర్యాలీ తీయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో బండి సంజయ్ ని అంతమొందించడానికి రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వెలబడ్డ విషయం విదితమే. ఎన్నడూ లేని విధంగా సంజయ్ ఇంటి ముందు నుండి నినాదాలు చేస్తూ ముస్లిం యువకులు వెళ్లడంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు బండి సంజయ్ ఇంటిపై అల్లరి మూకలు రాళ్లు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల వైఫల్యం అంటున్న బిజెపి శ్రేణులు
మిలాద్ ఉన్ నబి పండుగ రోజు బండి సంజయ్ ఇంటి వద్ద బిజెపి పార్లమెంటు కార్యాలయం ముందు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని బిజెపి శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఘటన జరిగినట్లు వారు ఆరోపిస్తున్నారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉందో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలకు దిగిన బిజెపి శ్రేణులు
ఘటన జరిగిన క్షణాల్లోనే బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.ఎంఐఎం అల్లరి మూకల పని అంటూ బిజెపి శ్రేణులు విరుచుకుపడుతున్నారు.ముస్లిం యువకులు చేపట్టిన ర్యాలీకి నిరసనగా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. హిందువుల సంఘటితశక్తిని చూపెడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతోంది. బిజెపి పార్లమెంటు కార్యాలయంలో ఏసిపి కి జరిగిన ఘటనపై బిజెపి నాయకులు వివరించారు. అనంతరం సిపిని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.ఏది ఏమైనప్పటికిని హిందూ ముస్లిం మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసే చర్యలను ఆదిలోనే అంతం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.