- వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో ఘర్షణ
- ఒకరి ఇంటి పై దాడి కారు ధ్వంసం
తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉదృత పరిస్థితులు ఏర్పడి ఇళ్లపై దాడులకు దారితీసాయి. ఈ దాడులలో వెలుగు భాస్కర్ , ఉమేష్ పై దాడి చేసిన కొందరు ఇంటిలోని కారును ధ్వంసం చేశారు .జరిగిన సంఘటనకు సంబంధించి బాధితులు వెలుగు భాస్కర్, ఉమేష్ లు తెలిపిన వివరాలుఇలాఉన్నాయి.
బుధవారం రాత్రి తాము కరివిరాలలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం నిమజ్జన కార్యక్రమానికి పక్కనే ఉన్న కచ్చకుంటకు తీసుకు వెళ్తుండగా తమ కన్నా ముందు వెళ్తున్న వినాయక నిమజ్జన బృందం వారు పక్కకు జరగకుండా తమను ఇబ్బందులకు గురిచేసారని ఇదేమని ప్రశ్నించగా అ కారణంగానే తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు .అనంతరం వినాయక నిమజ్జనం చేసి తమ ఇంటికి వెళ్లగా ఇంటి పైకి వచ్చిన దుండగులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారని ఇంటి ఆవరణలో ఉన్న తమ సొంత కారును కర్రలతో ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయమై తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తమకు తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరారు.