సోషల్ మీడియాలో గత వారం రోజుల నుండి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం పూర్తిగా అవాస్తవమని పలువురు జనగామ టిడిపి నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధికారికంగా ఏ పార్టీ కి మద్దతు ప్రకటించలేదని ఇలాంటి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో లో ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య, తాళ్లపల్లి ఏల్లేష్, ఎండీ ఎక్బల్, గోళ్ల శ్రీనివాస్ రావు, గుండె సందీప్, ఉల్లెంగుల అన్వేష్, అదునూరి బాలరాజు, బల్నే రమేష్, అమనగంటి శ్రీకాంత్, శేకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.