లంచం ఇస్తేనే అర్జీదారునికి మేక్షం లభిస్తుంది…
తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్య మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయం లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని ఉన్నతాధికారులు చెపుతున్నా.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల పని తీరు మాత్రం మారడం లేదు. ఫలానా ధ్రువ పత్రాలను పలానా గడువు లోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిది. కానీ అధికారులు మాత్రం డబ్బుల కోసం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన్నా చేస్తున్నారు. ఆన్లైన్ లో అర్జీ చేసుకున్న తర్వాత ధ్రువ పత్రాల కోసం నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయడమే జరుగుతుంది. రైతులు భూమి గురించి అర్జీ చెసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయవలసింది.
పోయి వివిధ రకాల కారణలు చెపుతూ పట్టాలు చేయడంలేదు.అధికారుల నిర్లక్ష్యం వలన కొంతమంది వ్యవసాయ భూములను ఎస్సారెస్పీ కాల్వల కింద ప్రభుత్వ భూమి లాగా నమోదు చేశారు.రైతులు తహశీల్దార్ కి ఆ భూముల ను ఆన్లైన్లో మార్పిడి చేయాలని అర్జీ పెట్టుకున్న మూడు నాలుగు నెలలు అయినా చేయడం లేదు డబ్బులు ఇస్తేనే రైతుల పేరు మీద మార్పిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇచ్చిన అర్జీదారుని సమస్యను పరిష్కరిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు వ్యవస్థీకృతంగా మారిపోయింది. ఏపని కావాలన్న ఎక్కువ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాల్సిందే. లంచం ఇస్తేనే అర్జీదారునికి మోక్షం లభిస్తుంది లేకపోతే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికైనా ఉన్నంత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అర్జీదారులు కోరుచున్నారు.