కాలేజీ గ్రౌండ్ సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే:సీఎం కేసీఆర్ భువనగిరి వేదికగా భారీ బహిరంగ సభతో ఈనెల 16న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ సభా స్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ భువనగిరి ని వేదికగా చేసుకొని ఎన్నికలలో వెళ్తున్నందున సభకు ప్రజలు భారీగా రానుండడంతో ఇలాంటి ఇబ్బందులు కు తావు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు రాజశేఖర్, ఊదరి సతీష్ ఉన్నారు.