బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే ఓసీలకు 58, బీసీలకు 22లకు స్థానాలు దక్కాయి.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ తొలి జాబితాలో అన్ని సామాజిక సమీకరణాలతో సీట్లు కేటాయించింది. మొత్తం 119 స్థానాలకు గానూ 115 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ 4 స్థానాలను పెండింగ్ పెట్టింది. ఈసారి రెండు చోట్ల సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. గతంలో మాదిరి ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికే అధిక సీట్లు దక్కాయి. 40 స్థానాల్లో రెడ్డి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో ఓసీ 58, బీసీ 22, ఎస్సీ 20, ఎస్టీ 12 , మహిళలు 7, మైనార్టీలు ముగ్గురు బరిలో నిలవనున్నారు.
తొలి జాబితాలో సామాజిక సమీకరణాలు
115 మంది అభ్యర్థుల్లో ఓసీ-58, బీసీ-22, ఎస్సీ-20, ఎస్టీ-12, మైనార్టీ-3, మహిళలు-7
ఓసీ 58 మంది అభ్యర్థుల్లో రెడ్డి-40, వెలమ-11, కమ్మ-5, వైశ్య-1, బ్రాహ్మణ-1,
బీసీ 22 మంది అభ్యర్థుల్లో మున్నూరు కాపు-10, యాదవ్-5, గౌడ-4, బెస్త-1, వంజర-1, పద్మశాలి-1
ఎస్టీ 12 మంది అభ్యర్థుల్లో లంబాడీ-7, ఆదివాసీ-5
ఎస్సీ 20 మంది అభ్యర్థుల్లో మాల-8, మాదిక-11, నేతకాని-1
2018లో ఇలా?
2018 ముందస్తు ఎన్నికల్లో ఒకేసారి 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. అప్పట్లో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. గత జాబితాలో కులగణన ఆసక్తిదాయకంగా ఉంది. అభ్యర్థుల ప్రకటనలో కేసీఆర్ ఎవరికి ప్రాధాన్యతను ఇచ్చారు? ఏ కులం వారు బీఆర్ఎస్ నుంచి అత్యధిక సీట్లను పొందారు? పరిశీలిస్తే… 35 స్థానాలు ఒకే సామాజికవర్గం అభ్యర్థులకు దక్కాయి. కులాల వారీగా అభ్యర్థుల సంఖ్యను చూస్తే రెడ్డి సామాజికవర్గానికి అత్యధిక సీట్లు కేటాయించారు కేసీఆర్.
105 మంది అభ్యర్థుల జాబితాలో 35 మంది రెడ్లు ఉండగా, ఆ తర్వాత బీసీలకు ప్రాధాన్యత దక్కింది. అన్ని బీసీ కులాల అభ్యర్థులు కలిసి 20 మంది 2018 తొలి జాబితాలో ఉన్నారు. మూడో స్థానంలో ఎస్సీలు మొత్తం 15 మంది ఉన్నారు. వీరిలో మాదిగలు-8, మాల -7గురు ఉన్నారు. ఆరు మంది కమ్మ అభ్యర్థులు టికెట్లు ఇవ్వగా, ఎస్టీలు దాదాపు 14 సీట్లను పొందారు. ముస్లింలు రెండు సీట్లలో నిలిచారు. బ్రాహ్మణులు ఒక్కరు, వైశ్యులు ఒక్కరు, క్షత్రియులు ఒక్కరు 2018 బీఆర్ఎస్ తొలి జాబితాలో స్థానం దక్కించుకున్నారు.