డిపివో తూతిక శ్రీనివాస విశ్వనాధ్
ఏలూరు, జూలై, 24:ఏలూరు, నూజివీడు డివిజన్ల పంచాయితీ కార్యదర్శులు, ఈవోపిఆర్డిలు, డిఎల్ పివోలతో ఈ నెల 25వ తేదీన స్పందన పరిష్కారాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. జంగారెడ్డిగూడెం పంచాయితీ శాఖ వరద సంబంధిత కార్యకలాపాలు కారణంగా అక్కడ సిబ్బందిని మినహాయించబడిందన్నారు. ఏలూరు, నూజివీడు డివిజన్ల లోని పంచాయితీ శాఖ సిబ్బందితో స్పందన పరిష్కారాలపై ఈ నెల 25వ తేదీ మంగళవారం ఏలూరులోని జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహంచడం జరుగుతుందన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో సమయపాలన ఆధారంగా పిటీషన్లు పరిష్కరించడం, పిటీషన్ల పరిష్కారంలో గుణాత్మక పద్దతిలో పరిష్కరించడం జిల్లాస్ధాయి స్పందన పిటీషన్ల ను స్కేల్ డౌన్ చేయడం, రీఓపెన్ కేసులను నిర్ధారించడానికి, ఏవైనా కేసులను రీఓపెన్ చేస్తే ఎలా పరిష్కరించాలి, బియాండ్ ఎస్ఎల్ఎ మించి లేకుండా పరిష్కరించడం, స్పందన రిజిష్టర్లను సరిగా నిర్వహించడం అంతర్గత ఎస్ఓపి, టైమ్ లైన్, రివ్యూ స్పందన ఆడిట్ లను సిద్దం చేయడం అంశాలపై సమీక్షంచడం జరుగుతుందని కావున ఈ సమావేశానికి స్పందన పిటీషన్లు పెండింగ్, పరిష్కార సమాచారం తో హాజరు కావాలన్నారు.
ఈ సందర్బంగా కొన్ని స్పందన రీఓపెన్ కేసులు, బియాండ్ ఎస్ఎల్ఎ పిటీషన్లలకు సంబంధించి కేసు స్టడీని సిద్దం చేయడం జరిగిందని అదే విధంగా పిటీషన్లను ఎలా పరిష్కరించాలో ఎస్ఓపి సిద్దం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా అనాధికార లేఅవుట్లు, ఆక్రమణలు, పారిశుధ్యం, త్రాగునీరు, గ్రామ పంచాయితీ నిధులు దుర్వినియోగం, చేపల చెరువులు తదితర అంశాలపై పిటీషన్లు పరిష్కార తీరుపై సమీక్షించడం జరుగుతుందన్నారు. కావున ఏలూరు, నూజివీడు డివిజన్ల పంచాయితీ కార్యదర్శులు, ఈవోపిఆర్డిలు, డిఎల్ పివోలు,తప్పనిసరిగా ఈ సమీక్షా సమావేశానికి హాజరుకావాలన్నారు.