A place where you need to follow for what happening in world cup

తన మాట వింటూ అనువుగా ఉండే వాళ్లకు రేవంత్ అందలం ?

హైదరాబాద్‌, జూలై 29: తన వ్యతిరేకులను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించేందుకు టీపీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారా? తన మాట వింటూ అనువుగా ఉండే వాళ్లు ఇక్కడ ఉండేలా… అడ్డొచ్చే వాళ్లను ఢిల్లీకి పంపించేలా స్కెచ్‌ వేస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలకు కాంగ్రెస్‌ పార్టీలో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో తన ఆధిపత్యానికి అడ్డులేకుండా చూసుకొనేందుకు రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందుకు రాబోయే ఎన్నికలనే అస్త్రంగా మార్చుకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తన మాట వింటూ తనకు అనువుగా ఉండే వాళ్లను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి, రాష్ట్ర రాజకీయాల్లో ఉండేలా..తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ అడ్డొచ్చే వాళ్లను ఎంపీలుగా పోటీ చేయించి ఢిల్లీకి పంపించేలా భారీ స్కెచ్‌ సిద్ధం చేస్తున్నట్టుతెలిసింది.ఈజాబితాలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఇందుకు అనుగుణంగానే టికెట్ల కేటాయింపు జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సీనియర్‌ నేతలకు చెక్‌పెట్టేందుకుగానూ రేవంత్‌ ‘ఒకే కుటుంబం ఒకే టికెట్‌’ నినాదాన్ని మరింత బలంగా అమలుచేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే తొలిదెబ్బ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పడనున్నది. గతంలో హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో ఆయన, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్‌ నల్గొండ ఎంపీగా గెలువగా, ఆయన భార్య పద్మావతి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పద్మావతి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా, ఉత్తమ్‌ కోదాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీన్ని రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అధిష్ఠానం మెత్తబడితే ఉత్తమ్‌ను ఎంపీగానే పోటీ చేయించేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కోదాడలో ఇతర పార్టీలోని సీనియర్‌ నేత చేరికను ప్రోత్సహిస్తున్నట్టు ప్రచా రం జరుగుతున్నది. తనకు పార్టీలో పోటీవచ్చే నేతల్లో ముఖ్యుడైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపైనా రేవంత్‌ దృష్టిపెట్టారు. భట్టి విక్రమార్కను ఎమ్మెల్యేగా ఓడించేలా పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్కకు చెక్‌పెట్టేందుకుగానూ తన సామాజిక వర్గమైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.