- మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము
- మధ్యాహ్నం గం.2 నుండి రాత్రి గం.7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సైబరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.