జఫర్‌గడ్ లో పార మిలిటరీచే ఫ్లాగ్ మార్చ్
జఫర్‌గడ్జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సహకరించాలని ఏసిపి రఘు చందర్ ప్రజలను కోరారు. మంగళవారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో ఏసిపి రఘు చందన్ ఆధ్వర్యంలో పారా మిలిటరీ, స్థానిక పోలీసులచే కలిసి మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారులకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసిపి రఘు చందర్ మాట్లాడుతూ ఎవరైనా గొడవలు సృష్టించాలని చూసిన, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేందర్, పోలీసు బృందం పాల్గొన్నారు.