పూజల్లో పాల్గొన్న సిపి ఎల్. సుబ్బరాయుడు
కరీంనగర్ : జిల్లా కమిషనరేట్ కార్యాలయంలో దసరా పర్వదినం సందర్బంగా నిర్వహించిన వాహన, ఆయుధ పూజా కార్యక్రమాల్లో పోలీసు కమీషనర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్ సుబ్బరాయుడు ఆకాంక్షించారు. ప్రజల సహకారం అనేది మనకు గొప్ప ఆయుధం అని విజయం చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికలలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పోలీసుల గౌరవం, కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఎల్&ఓ) లక్ష్మినారాయణ , అడిషనల్ డీసీపీ పరిపాలన రాజు, ఏసిపి సి. ప్రతాప్, సి సి ఆర్ బి, ఏ సి పి విజయ్ కుమార్, ఆర్ ఐ లు సురేశ్ ,శ్రీధర్, శేఖర్ బాబు, సిఐలు సృజన్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.