శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి:నిజామాబాద్ సభలో మోడీ చేసిన ప్రసంగం ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆయన కుటుంబ సభ్యులపైన అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధాన మంత్రికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హ్వత లేదని మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కిన ఘనుడు మోదీ అని ఎద్దువ చెశారు. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట తెలంగాణ రాష్ట్రాన్ని పలుమార్లు ప్రధాన మంత్రి అవహేళన చేయ్యటం సరికాదన్నారు.
వెంటిలేటర్ పైన ఉన్న బీజేపీ పార్టీని కాపాడుకోవడానికి మోదీ కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయ్యటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. అవినీతిపరులు నా పక్కన కూర్చోవడానికి బయపడుతారని మోదీ అనడం హాస్యాస్పదంగా ఉందని, ఈడి, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బిజెపి పార్టీలో ఎందుకు చేర్చుకొంటున్నారని హేళన చేశారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలి అంటే మోడీ ఆశీర్వదం అవసరం లేదన్నారు. కేటీఆర్ ఉన్నతమైన చదువు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్లో గొప్ప అభిమానాన్ని సాధించుకున్న నాయకుడు, కేటీఆర్ భవిష్యత్ లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారన్నారు.
అందులో ఎవరికి సందేహం లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటే అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గుర్తు చేశారు. వారసత్వ రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బిజెపి పార్టీ ఆ పార్టీ నేతలు కుటుంబ పాలనపై మాట్లాడటం విడ్డురమన్నారు. ప్రధాని మోదీ ఒక నియంతలా ఆలోచిస్తు, కక్ష్యపురితంగా వ్యవహరించడం పద్దతి కాదని, సీఎం కేసీఆర్ పై మాట్లాడే అర్హ్వత ప్రధాన మంత్రి మోదికి అస్సలు లేదని, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. సభలో ప్రధాన మంత్రి మోది చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.