- రైతు అందోళనలకు చెక్ పెడుతూ ఇథనాల్ ప్రాజెక్ట్ స్థానంలో వ్యవసాయ కళాశాల శంకుస్థాపన
- రైతులకు నష్టం లేకుండా జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అమలుకు హామీ
- రైతు వ్యతిరేక ముద్ర తొలగించుకుంటున్న బిఆర్ ఎస్
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన మంత్రి కేటిఆర్ సభులు బిఆర్ ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాయి. రెండు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేసిన మంత్రి కేటి ఆర్ అక్కడి ఉన్న కొన్ని సమస్యలను పటాపంచలు చేసి బిఆర్ ఎస్ పార్టిఫై రైతులలో ఉన్న వ్యతిరేకతను తొలగించి వేశారు. జగిత్యాల ప్రాంతం అనగానే వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ రైతులు సెంట్ భూమి కూడా వదలకుండా సాగుచేసుకొని ఉపాధి పొందుతారు. వెలగటూర్ మండలంలో ప్రభుత్వం ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పటు చేసేందుకు క్రిబుకో సంస్థకు అనుమతులు ఇచ్చి ప్రభుత్వ భూమిని కేటాయించగ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి చదును చేసే పనులు ప్రారంబిచారు.
అయితే ఇథనాల్ ప్రాజెక్ట్ తో వాయు, జల కాలుష్యం జరిగి తమకు నష్టం జరగుతుందని రైతులు ఆందోళన చేపట్టి పనులు అడ్డుకున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు మద్దతు పలికి ప్రత్యేక్ష ఆందోళనలు చేశారు. దీంతో రైతుల్లో బిఆర్ ఎస్ పార్టీఫై వ్యతిరేకత వచ్చింది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వం యంత్రంగం రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహించిన పలితం లేకుండా పోయింది. అయితే కేటిఆర్ ధర్మపురి పర్యటనలో భాగంగా ఇథనాల్ ప్రాజెక్ట్ స్థానంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో అక్కడి రైతు వ్యతిరేకత నుండి బయటపడి ఇప్పుడు పాలభిషేకలతో రైతుల మన్ననలు పొందుతున్నారు. ఇదిన ఆ ప్రాంత బిఆర్ ఎస్ నాయకులకు మరింత జోష్ పెంచింది.
జగిత్యాలలో పెస్పి, కొక్కోకోలా కంపని
ప్రభుత్వం నూతన జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చింది. అయితే ఇందులో జగిత్యాల చుట్టూ పక్కల గ్రామాల రైతులు వ్యవసాయ భూములు కోల్పోతున్నామని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు బిజెపి నాయకులు అండగా నిలిచారు. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు ఎలాంటి నష్టం జరగదని నష్టం జరిగే దాన్ని తాను ఒప్పుకోనని మున్సిపల్ సమావేశంలో నూతన మాస్టర్ ప్లానును రద్దు చేస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ మాస్టర్ ప్లాను రద్దు కాగా జగిత్యాలలో 1956లో ఏర్పడి మున్సిపాలిటి అస్తవ్యస్తంగా ఉందని రైతులకు నష్టం లేకుండా నూతన మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని జగిత్యాలకు వచ్చిన కేటీఆర్ ను ఎమ్మెల్యే కోరగా ఆయన అంగీకరించారు.
అంతేకాకుండా ఇక్కడ రైతుల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వపరంగా పెద్ద రైస్ మిల్ ఏర్పాటు చేయాలని కోరగ ఈ ప్రాంతంలో మామిడి పంట ఎక్కువగా వస్తుందని మామిడి రైతులకు, అదే విధంగా యువతకు చేయూతనిచ్చేందుకు జగిత్యాల ప్రాంతానికి పెప్సీ లేదా కోకోకోలా కంపెనీ తీసుకువస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరిక మేరకు జగిత్యాల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తీసుకువస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో రైతు పక్షపాతిగా, యూత్ కు ఉపాధి కల్పన దిశగా కేటీఆర్ హామీలు ఉండడంతో టిఆర్ఎస్ నాయకులు ఉత్సాహం నింపింది. కేటీఆర్ సభ బిఆర్ ఎస్ కార్యకర్తల్లో అటు నాయకులకి కొత్త జోష్ నింపిందని అంటున్నారు.