సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు,బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కేసిఆర్ గారికి,తనకు మద్దతుగా నిలవాలని స్వచ్చందంగా వచ్చి పార్టీలో చేరిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని మంత్రి అన్నారు. మీకు ఎల్ల వేళలా అండగా ఉంటానని, తడ్పాకల్ గ్రామం మరింత అభివృధ్ది చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.