- మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కులాలు మతాలకు సుమచితమైన స్థానం కల్పిస్తున్నాడని, ప్రతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్టి పుట్ట మధు అన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని మంథని పట్టణంలోని రాజగృహాలో సోమవారం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో కలిసి ఆయన సహపంక్తి బోజనం చేశారు. దసరా పండుగ రోజున అన్ని మతాల వారితో ఒక్కచోట కలిసి బోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి అన్ని వర్గాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గత ప్రభుత్వాలు కులాలు, మతాలను వాడుకుని అధికారం కోసం ఆశపడ్డారే కానీ, ఏనాడు అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యతతో ఉండేలా ఆలోచన చేయలేదన్నారు. కానీ ఈనాడు సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌ల సంప్రదాయాలకు అనుగుణంగా అతిపెద్దగా జరుపుకునే బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌లాంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రభుత్వపరంగా కానుకలు అందిస్తున్నరన్నారు. ఈ. ఈ కార్యక్రమంలో మంథని ముస్లిం, క్రిస్టియన్స్ మత పెద్దలు పాల్గొన్నారు.