త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ మూడవసారి విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానం సృష్టించబోతుందని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో స్థానిక దేవిశ్రీ గార్డెన్లో గురువారం బిఆర్ఎస్ మండల కార్యకర్తల సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అక్టోబర్ 16వ తేదీన జరగబోయే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని, బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరల గెలిపించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని, మూడవసారి కూడా ఆయనని ముఖ్యమంత్రిని మరియు ఎమ్మెల్యే ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫీడ్ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, రాష్ట్ర నాయకులు వంగాల వెంకన్న, నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్, ముద్దసాని కిరణ్ రెడ్డి, బిఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, ఎమ్మె లింగస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పైల రాజవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ పల్సo రమేష్, మండల రైతు కోఆర్డినేటర్ పడమటి మమత, మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,వివిధ గ్రామల గ్రామశాఖ అధ్యక్షులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.