- అవయవదానానికి ముందుకొచ్చిన భారత రమేష్ కుటుంబ సభ్యులు
- కళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె ఇవ్వడానికి అంగీకారం
రెక్క ఆడితే కానీ డొక్కా ఆడనీ కడు పేదరిక కుటుంబం. వారికి ఇద్దరు ఆడపిల్లలు,ఒక బాబు. టైలరింగ్ వృత్తితో చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబంలోని యజమాని మరణంతో వారు రోడ్డున పడ్డారు. మృత్యువు త్రిబుల్ రైడింగ్ తో వెళుతున్న ముగ్గురు యువకులు స్పీడ్గా వచ్చి డాష్ ఇవ్వడంతో మరణం సంబంధించింది. వచ్చిన టూవీలర్ వారి జీవిత ఆశలను అడియాశలు చేసింది. పిల్లలను పెంచి పెద్ద చేసి వారి ఆలనా పాలన చూసుకొని హాయిగా గడపాల్సిన రమేష్ అకాల మరణంతో ఆ కుటుంబం గుండెలు అవిసెలా రోదిస్తుంది ఇంతటి విపత్కర సమయంలోను ఆ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు నిజంగా అభినందించాల్సిన విషయం.
పుట్టేడు శోకాన్ని పక్కనపెట్టి తన భర్త అవయవాలు మరొకరికి పునర్జన్మను అందిస్తున్నాయని ఒక సదాశయంతో అతని భార్య మిగతా కుటుంబ సభ్యులు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో బ్రెయిన్ డేడ్ తో మరణించిన రమేష్ రమేష్ కళ్ళు కిడ్నీలు ఊపిరితిత్తులు గుండెలను గురువారం రాత్రి దానం చేశారు.
మరణశయ్యపై కుటుంబ పెద్ద మరణిస్తాడని తెలుసు..
ఓ వైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఆశ.. ఆ శ్వాసే వారిని అవయవదానం చేయించింది..! మళ్లీ ఆయన కళ్లు రంగుల ప్రపంచాన్ని చూపించనున్నాయి.. ఊపిరితిత్తులు శ్వాసించనున్నాయి.. గుండె లబ్ డబ్ అని కొట్టుకోనుంది.. కిడ్నీలు పని చేయనున్నాయి.. నలుగురికి జీవితాన్ని ఇవ్వనున్నాయి. రమేష్ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయాన్ని అందించాలని, ముగ్గురు పిల్లలను ప్రభుత్వమే చదివించాలని పలువురు కోరుతున్నారు.