A place where you need to follow for what happening in world cup

మెట్రోలో కేటీఆర్ హల్​చల్​

0 165

రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు మెట్రో రైల్లో మంత్రి కేటీఆర్​ హల్ చల్ చేశారు. ట్రైన్ లో ప్రయాణికుల సంభాషించారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయాణికులు పెద్దఎత్తున ఉత్సాహం చూపారు. వారితో కలిసిపోయి సరదాగా అనేక అంశాలపై ముచ్చటించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన తర్వాత రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. తన 20 నిమిషాల ప్రయాణంలో ఆయన పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబీబీఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు పైన కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న తీరు తనకు ఎంతో గర్వాన్ని ఇస్తుందని తెలిపారు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినులు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు.

KTR Hullchal in Metro

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకు నన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. వీరితోపాటు పలువురు మహిళలు, వృద్ధులతో కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేరళకు చెందిన ఒక టూరిస్ట్ హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నట్టు తెలిపారు.

KTR Hullchal in Metro

హైదరాబాద్ నగరం నేను ఇంటర్నెట్ లో తెలుసుకున్న దానికన్నా గొప్పగా ఉన్నదని, ముఖ్యంగా నూతనంగా వచ్చిన అనేక కట్టడాలు, రోడ్లను చూస్తే ఒక విదేశీ నగరంలో పర్యటిస్తున్నట్లు అనిపించిందని ఆయన ప్రశంసించారు. నేను ఎవరో తెలుసా అని ఆ టూరిస్ట్ ని మంత్రి కేటీఆర్ అడిగినప్పుడు, మీరు ఎందుకు తెలవదు మాకు, ముఖ్యంగా తెలంగాణకు కిటెక్స్ పరిశ్రమ వచ్చినప్పుడు మీ గురించి విస్తృతమైన చర్చ మా రాష్ట్రంలో జరిగిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు యువకులతో, యువతులతో కేటీఆర్ మాట్లాడారు. వారంతా తాము ఐటీ, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న విషయాన్ని కేటీఆర్ కి తెలిపారు. ‘30వ తేదీన ఎన్నికలు ఉన్న విషయం మీకు తెలుసా’ అని ప్రశ్నించారు. మీలాంటి చదువుకున్న యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఒక గంట సమయాన్ని ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు కేటాయిస్తే మరో ఐదు సంవత్సరాలపాటు మంచి నాయకులను ఎన్నుకోవచ్చని సూచించారు. 30వ తేదీన కచ్చితంగా ఓటు ప్రక్రియలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ప్రగతి ప్రస్థానం.. ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పుస్తకావిష్కరణ
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం.. ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ అనే పుస్తకాన్ని శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు రాష్ట్రంలోని గడపగడపకూ చేరాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిందనీ, 2023 లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.