హైదరాబాద్:వనమా వెంకటేశ్వరరావుపై 2019 లో హై కోర్టులో పిటిషన్ వేసాననని బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చింది. నన్ను ఎమ్మేల్యేగా కోర్టు పరిగణించింది. వనమా వెంకటేశ్వర రావును డిస్ క్యాలిఫై చేసింది. నాది నైతిక విజయం. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశా.
స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడాను. 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు అన్ని చూశాం. బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాను. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలుస్తా. ఎమ్మేల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం కు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని అన్నారు.