హైదరాబాద్:మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వీపనగండ్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యెట్టం కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటస్వామి, దేవినేనిపల్లి సర్పంచ్ కొండల్ రావు, బీఆరెస్ మండల నాయకులు చిదంబర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.