A place where you need to follow for what happening in world cup

మెదక్ కమలంలో లీడర్ల వేట

తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోవాలని కమలం పార్టీ పెద్దలు ఇప్పటికే నేతలకు సూచనలు చేశారు. దీంతో బీజేపీలోని పెద్ద నేతలంతా ఆ ఆలోచనతో ముందుకు వెళ్తుంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ నేతలు మాత్రం చాలా సైలెంట్ అయ్యారట. గత కొద్దిరోజుల క్రితం హడావుడి చేసిన నేతలు, ఇప్పుడు అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే లేదట.. దీంతో అక్కడ బీజేపీ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయని.. టాక్ వినిపిస్తోంది. ఇంతకి అది ఏ నియోజకవర్గం.. ఎవరా.. నేత అనే వివరాలు తెలుసుకోండి.. సంగారెడ్డి.. ఆందోల్-జోగిపేట నియోజకవర్గంలోని కమలం పార్టీకి ఆర్జెంట్ గా లీడర్లు కావాలంట.. గత కొద్దిరోజులుగా పార్టీని నడిపే లీడర్లు లేకపోవడంతో కార్యకర్తలందరూ నైరాశ్యంలో ఉన్నారట.. ఆందోల్-జోగిపేట బీజేపీ పార్టీలో లీడర్లు లేరా అంటే.. గట్టి నేతలే ఉన్నారు.. కానీ,ఈ మధ్య కాలంలో నియోజకవర్గన్ని అసలు పట్టించుకోవడం లేదట.. ఒకప్పుడు నాయకత్వం కోసం కొట్టుకున్న లీడర్లు ఇప్పుడు అస్సలు పార్టీని పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఆందోల్ నియోజకవర్గ బీజేపీలో సీనియర్ లీడర్ బాబుమోహన్.. ఈయన నియోజకవర్గంలో కనిపించక చాలా రోజులైందట.. అందోల్ బీజేపీ నేతలకు టచ్‌లో కూడా లేరని బహిరంగంగా పేర్కొంటున్నారు బీజేపీ నేతలు..ఆందోల్‌ బాబూ మోహన్‌తోపాటు మరో నేత ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య.. వీరిద్దరు అందోల్ బీజేపీలో సీనియర్ లీడర్లు ఇప్పుడు వీరిద్దరు పార్టీని పట్టించుకోవడం లేదని సొంత పార్టీ క్యాడరే పేర్కొంటుండం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట నియోజకవర్గ పరిధిలో బాబుమోహన్ బాగానే తిరిగే వారు.. అయితే అదే సమయంలో బాలయ్య బీజేపీ పార్టీలోకి రావడంతో ఇద్దరి మద్య గొడవలు అయ్యాయట. ఏ కార్యక్రమం చేసిన ఎవరికి వారే చేసేవారట..అలాంటి నేతలు ఇప్పుడు నియోజక వర్గంలో కన్పిస్తాలేరని పేర్కొంటున్నారు. వీరిద్దరి తీరు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్లుగా మారిందట.. ఒకప్పుడు ఆధిపత్యం కోసం కొట్టుకున్న ఈ ఇద్దరు నేతలు..

ఇప్పుడు ఉన్న అవకాశాన్ని కూడా చేజార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.నియోజకవర్గ పరిధిలో ఉన్న బీజేపీ కార్యకర్తలను ముందుకు నడిపే లీడర్లు లేకపోవడంతో వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారట.. ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కూడా అందోల్-జోగిపేట్ నియోజకవర్గ పరిధిలోని జరగడం లేదట.. మొన్నటికి మొన్న బీజేపీ టిఫిన్ కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జరిగాయి.. కానీ అందోల్-జోగిపేట్ లో మాత్రం టిఫిన్ భైటో కార్యక్రమం జరగలేదట.. అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ లీడర్లు రావడం లేదని సొంత క్యాడరే విమర్శిస్తుండటం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.ఇతర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై నిరసనలు తెలుపుతూ ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటే.. బీజేపీ మాత్రం ఏం చేయలేదంటూ సొంత కార్యకర్తలు చెబుతుతుండటం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ఉన్న కూడా వారికి దిశ నిర్ధేశం చేసే నేతలు కరువైనరని ఆందోల్ బీజేపీలో ఆందోళన మొదలైంది. గతంలో ఓకే పార్టీలో ఉన్నప్పటికీ బాబుమోహన్, బాలయ్యకి ఇద్దరికి పడక ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకునేవారు.. ఆ సమయంలో ఎవరి వైపు ఉండాలో అర్ధం కాక అగమయ్యాము.. ఇప్పుడు దిశానిర్దేశం చేసే లీడర్‌ లేక ఇలా ఆగం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అందోల్ బీజేపీ క్యాడర్..బాబు మోహన్ లాంటి సినియర్ లీడర్ కూడా పార్టీని పట్టించుకొకపోతే.. మున్ముందు ఎలా అని కార్యకర్తలు బహిరంగంగా పేర్కొంటున్నారు. బాలయ్య ఎంట్రీ బాబుమోహన్ కి ఇష్టం లేదు.. అయిన సరే కొద్దీరోజులు ఇద్దరు ఎవరికి వారు నియోజకవర్గ పర్యటనలు చేశారు.. కానీ ఒకేసారి ఇద్దరూ కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం.. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటం పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.