హైదరాబాద్ జూలై 22:వర్షాకాలంలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు స్పందించకుండాపోయాయి. నగర వాసులు చేస్తున్న వర్షాకాలం ఫిర్యాదులను బల్దియా కంట్రోల్ రూమ్ పట్టించుకోని పరిస్థితి. 040- 2111 1111 వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పదుల సార్లు కాల్స్ చేసే గాని కంట్రోల్ రూమ్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ నగరవాసుల మండిపడుతున్నారు.
పది కాల్స్‌లో కేవలం ఒకటి రెండు కాల్స్‌కు మాత్రమే జీహెచ్ఎంసీ స్పందిస్తోంది. బల్దియా కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా ఓ రిటైర్డ్ అధికారి ఉన్నారు. రోజుకు 500 నుంచి 700 వరకు ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అయితే మాన్సూన్ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ దాదాపు 24 గంటల సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెనువెంటనే సమస్యలు పరిష్కరించడంలో జీహెచ్‌ఎంసీ ఆలస్యం చేస్తుండటం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.