హైదరాబాద్ నగరంలో లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్, అమీర్పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్రింగ్ రోడ్, హస్తినాపురం, బీఎన్రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడ, కూకట్పల్లి, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెబీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్భుల్లాపూర్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతున్నది.. కుత్బుల్లాపూర్ గాజులరామారాం లోని బాలజీ లేఅవుట్, వోక్షిత ఎంక్లేవ్ ఆదర్ష్ నగర్ ప్రాంతాలలో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఎగువ పెద్ద చెరువు అలుగు ద్వారా నీరు చేరుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మళ్లీ ప్రవాహం పెరిగి రోడ్లు జలమయం అయ్యాయి