రైతు రుణ మాఫీ సవాల్ ఏమయ్యింది
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న
హరీష్‌రావు..నీ రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పై కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతు రుణమాఫీ సువర్ణ అక్షరాలతో లిఖింప దగ్గ కార్యక్రమం అన్నారు. రైతు బంధుకు, రైతు రుణమాఫీకి సంబంధం లేదన్నారు. రైతు బంధు యథావిధిగా అమలవుతుందన్నారు.
రైతు రుణమాఫీని జీర్ణించుకోలేక కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదన్నారు. పట్టాదారు పాస్ బుక్ కల్గిన ప్రతి రైతుకు ఋణ మాఫీ చేసి తీరుతామన్నారు. రైతు, రైతు కూలీ శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.మరి ఇప్పుడు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎలా స్పందిస్తారు. ఆయన చెప్పినట్లుగానే రాజీనామా చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.