- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కల్వకుంట్ల సంజయ్
- పలు సంఘాల అభివృద్ధి కోసం10 లక్షల ప్రొసీడింగ్ లెటర్స్ అందజేత
కోరుట్ల:రాష్ట్రంలో కుల సంఘాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కల్వకుంట్ల సంజయ్ ఆన్నారు..శుక్రవారం పట్టణంలోని ప్రకాశం రోడ్డు లోని గోనెకాపు సంఘం అభివృద్ధి కోసం 3 లక్షల రూపాయలను, మున్నూరు కాపు యువజన సంఘం అభివృద్ధి కోసం 4 లక్షల రూపాయలు,అలాగే కల్లూరు రోడ్డులో గల స్నేహ మిత్ర సంఘం అభివృద్ధి కోసం 3 లక్షల రూపాయలు విలువ గల ప్రొసీడింగ్ లెటర్స్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంఘాల అధ్యక్ష, కార్యవర్గానికి అందజేశారు.. ఈ సందర్భంగా డాక్టర్. సంజయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కోల్పోయిన కుల సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు.
కుల బంధువులు సమావేశాలను నిర్వహించుకోవడానికి ప్రతి గ్రామంలో, పట్టణాల్లో కుల సంఘం భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం సంఘాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, ప్రజలందరూ కేసీఆర్ కి మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలని ఆన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ఎంపీపీ తోట నారాయణ, మెట్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్,వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు, సంఘాల అధ్యక్ష కార్యదర్శులు,సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు…