ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఎర్ర జెండా పార్టీల నేతలతో మధ్యవర్తిత్వం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీని ఓడించాలన్నలక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాయి కమ్యూనిస్టు పార్టీలు. అయితే మాకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తే జత కడతామని సీపీఐ నేతలు అన్నట్లు సమాచారం. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి ఫైనల్ చర్చలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
టీపీసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఠాక్రేతో సీపీఐ నేతలు కూనంనేని, చాడ, పల్లా వెంకట్‌రెడ్డి భేటీ ముగిసింది. ఓట్లు చీలకుండా అందరిని కలుపుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్.. వామపక్షాలతో కలిసి వెళ్లేందుకు సుముఖంగానే ఉంది. బీఆర్ఎస్‌తో స్నేహానికి బ్రేక్ పడడంతో కమ్యూనిస్టు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా.. త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదిలావుంటే చర్చల వివరాలను సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు మీడియా ముందుకు ఉంచారు. సాగదీత ధోరణి వద్దని చెప్పామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిగాయన్నారు. సానుకూల వాతావరణంలో తాము మాట్లాడుకున్నట్లుగా తెలిపారు. పొత్తుల విషయంలో సాగదీత ధోరణి అస్సలు పనికిరాదని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు.
ఒకట్రెండు సార్లు చర్చలతోనే అన్నీ జరిగిపోవాలన్నారు. అంతేగానీ బీఆర్‌ఎస్ వలె ఒకటిస్తాం.. రెండిస్తామన్న ధోరణితో ఉంటే అసలు చర్చలే అవసరంలేదన్న విషయం చెప్పామన్నారు.ఇక మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలు కోరుతున్న సీపీఐ. మునుగోడు, హుస్నాబాద్ సీట్లతో పాటు ఒక ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లుగా సమాచారం. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు పొన్నం ప్రభాకర్.మునుగోడు బైపోల్ తర్వాత బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లే అవకాశం ఉందని లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ నిన్న కేసీఆర్ 115 స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులనే ప్రకటించాక లెఫ్ట్ పార్టీల్లో అంతర్మథనం మొదలైంది. బీఆర్‌ఎస్‌తో పొత్తులు లేనట్టేనని క్లారిటీ వచ్చిన క్రమంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఏది ఏమైనా సంయుక్త కార్యాచరణతో ముందకు ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాయి.