A place where you need to follow for what happening in world cup

తెలంగాణపై ఫోకస్….

మరి కొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.  ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. అభ్యర్థుల ఎంపికకు పరిగణనలోనికి తీసుకోవాలసిన అంశాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటిని నిర్వహించింది. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో  కమిటీ సమావేశ మైంది. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు తీశారు.

రాష్ట్రాల్లో పరిస్థితులపై వచ్చిన సమాచారం ఆధారం గా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రావడంతో  ఎన్నికలను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార బాధ్యత లను ఎక్కువగా జాతీయ నాయకత్వమే తీసుకుని వ్యూహత్మకంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్ వినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలలో.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ లో అధికారం నిలుపుకోవడంతోపాటు గతంలో అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్,  రాజస్థాన్ లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో హోరాహోరీగా ప్రత్యర్థి పార్టీలతో తలపడాల్సి రావొచ్చని సమావేశంలో నేతలు అన్నట్లు సమాచారం.

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఎన్నికల బరిలో దింపాల్సిన అభ్యర్థులను ముందే గుర్తించి ప్రకటిస్తే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం తోపాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి తగినంత సమయం ఉంటుందని అన్నట్టు సమాచారం.సమయం దొరుకుతుం దని సమావేశం అభిప్రా య  పడితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కమిటీ ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణ లో పాతుకు పోయిన బీఆర్ ఎస్.. జోష్ తెచ్చుకుని..పరుగులు పెడుతున్న  కాంగ్రెస్.. ల నడుమ.. బీజేపీ ..అధికార పీఠం ఎక్కుతోందా.. ప్రత్యర్థులను ఢీ కొట్టే దమ్ము ఉందా..? కాలమే సమాధానం చెబుతోంది న్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను ముందుగానే రిలీజ్ చేయాలని  ప్రధాని మోదీ ఆదేశించినట్టుగా  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించక ముందే బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాలను ప్రకటించేవారు. ఈ సారి ముందుగానే కార్యాచరణలోకి వచచేశారు.  బీజేపీ తన తొలి జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు 21 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో ఐదుగురు మహిళలున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ఐదుగురు మహిళలు సహా 39 మంది అభ్యర్థులను కూడా బీజేపీ తన తొలి జబితాని ప్రకటించింది.వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్  రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించిన   తర్వాత ఈఅభ్యర్థుల ప్రకటన వెలువడింది.  ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

పార్టీ ముఖ్య నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేయడానికి పార్టీకి తగినంత సమయం ఉండేలా, అభ్యర్థుల మొదటి జాబితాను త్వరగా ప్రకటించాలని ప్రధాని మోడీ బీజేపీ అగ్ర నాయకులను సూచించడంతో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలు్సతోంది.  230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చేనెలలో ఎన్నికలు జరగనున్నాయి.రాజస్థాన్‌లలోనూ అభ్యర్థుల ఎంపికైప బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్షించినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో తొలి జాబితా విడుదలకు మరికొంత సమయం తీసుకోవాలని అనుకున్నారు. తెలంగాణలో తొలి జాబితా ఇప్పటికే సిద్ధమయింది.  అయితే.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.