- మద్యం అమ్మకాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందన్న ఈటల
- మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని ఎద్దేవా
- ఎన్నికల హామీల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శ
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందని ఎద్దేవా చేశారు. వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు చేపట్టిన ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర 50 రోజులకు చేరిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.