A place where you need to follow for what happening in world cup

రూట్లు మారుస్తున్న సైబర్ నేరగాళ్లు.. బంగారం ట్రేడింగ్‌తో భారీ మోసాలు

ఈ మధ్య ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లోన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు లభాలను ఆర్జిస్తున్నారు. కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేసి వాడుకుంటున్నారు. ముందుగా అందమైన అమ్మాయి ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం బంగారం రేటు మార్కెట్లో చాలా బాగుంది. అందులో పెట్టుబడి పెడితే ప్రతిరోజూ 5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చని చెబుతూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఇప్పటిదాక పార్ట్ టైం జాబ్స్, క్రిప్టో ట్రేడింగ్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసేవారు. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త రూట్లను వెతుక్కుంటున్నారు. వీటివల్ల భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. అత్యాశకు పోతున్నటువంటి చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి బలైపోతున్నారు.

ఆ తర్వాత తాము డబ్బులు పోగొట్టుకున్నామంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.మరో విషయం ఏంటంటే నేరగాళ్లు ఇలా సేకరించిన డబ్బును మొత్తం క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. దీంతో సైబర్ కేటుగాళ్లు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ముఠాలను అరెస్టు చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ఈ సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట జరుగుతునే ఉన్నాయి. రోజుకో కొత్త ఆలోచనతో మోసాలు చేసే ఈ సైబర్‌ చీటర్స్‌, ఇప్పుడు బంగారం మార్కెట్‌పై ఫోకస్‌ పెట్టడం కలకలం రేపుతోంది. బంగారం మార్కెట్‌ బయట చాలా నడుస్తోంది. గోల్డ్‌ ట్రేడింగ్‌ గురించి చర్చించేందుకు మీరు మా గ్రూప్‌లోకి రండి.. అంటూ మెసేజ్‌ పెట్టి ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది నిజమని నమ్మి చాలా మంది వారి చేతిలో మోసపోతున్నారు. ఆ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు విని.. ట్రేడింగ్‌ చేయాలంటూ డబ్బులు డిపాజిట్‌ చేసేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.