- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్
- కెసిఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం
కోరుట్ల:రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజ గుండెల్లో రైతు బాంధావుడిగా నిలిచారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్ ఆన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటనతో రైతన్న సంబరాలు అంబరానంటాయి.తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించి, తెలంగాణ అన్నదాతలకు తీపి కబురు అందించిన సందర్భంగా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డు లో గల గోనె కాపు సంఘం రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రైతులు,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్ తోకలసి సీఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ,సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాల అమలుతో సీఎం కేసీఆర్ రైతుగా నిలిచారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ఎంపీపీ తోట నారాయణ, మెట్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కేడిసిసి వైస్ చైర్మన్ పాతర్ల సత్యం, వివిధ వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.