హైదరాబాద్:మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో చిక్కుకుని బస్సు లో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.