నగరం లోని ఎన్ఎస్పీ(నాగార్జున సాగర్ ప్రాజెక్టు) కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మాదాసి రాజేశ్(16) గుండెపోటుతో మృతి చెందాడు.ఉదయం పాఠశాలకు వచ్చిన తర్వాత కొద్ది సేపటికే గుండె నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు అతని తండ్రి శంకర్ కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయిన రాజేష్.
రాజేష్ గుండె కు చిన్న రంధ్రం ఉండటంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రులు తిరిగి లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయిస్తున్నారు. తండ్రి నగరం లోని సీఆర్ టవర్స్ లో వాచ్మెన్ గా పని చేస్తు న్నారు. తల్లి ఇండ్లలో పని చేస్తుంది. బతుకు తెరువు కోసం వరంగల్ జిల్లా నుండి 15 సంత్సరాల క్రితం ఖమ్మం వచ్చి వాచ్మెన్ గా పని చేసుకున్నామని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని అని రాజేష్ తల్లిదండ్రులు అంటున్నారు.