A place where you need to follow for what happening in world cup

పాతబస్తీ బీఆర్ఎస్ లో కుమ్ములాటలు..దాడులు

హైదరాబాద్:పాతబస్తీ చార్మినార్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతల అంతర్గత కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి పై సల్లావుద్దీన్ లోధిపై  దాడి మరువక ముందే మరో మారు చార్మినార్ వద్ద దాడి చేయడం తీవ్ర కలకలకం రేపుతుంది.  చార్మినార్ సాక్షిగా చార్మినార్ నియోకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి పై సల్లావుద్దీన్ లోధి పై మంగళవారం  బహదూర్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి దాడిచేసి గాయపరచడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలలోకి వెళితే … మైనారిటీ బంధు పథకం కింద లక్ష రూపాయాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల మైనార్టీవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ ఆలీ చేతుల మీదుగా మంగళవారం పాలాభిషేకం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు.

ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హోంత్రి మహమూద్ ఆలీ కుమారుడు ఆజం అలీ తో పాటు చార్మినార్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి సల్లావుద్దీన్ లోధి తనకార్యకర్తలతో పాటు బహదూర్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి ఇనాయల్ ఆలీ బాక్రీ తన అనుచరులతో పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ చిత్ర పటానికి ఒక వైపు ఇనాయత్ ఆలీ బాక్రీ వర్గం ఉండగా మరో వైపు సల్లాఉద్దీన్ లోధి వర్గం నిలబడింది. హోంమంత్రి కుమారుడు ఆజం కూడా అక్కడే ఉన్నాడు. కాసేపట్లో హోంమంత్రి మహమూద్ ఆలీ అక్కడికి రాబోతున్న తరుణంలో  ఆయన దృష్టిలో పడడానికి కార్యకర్తలంతా హంగామా సృష్టించారు. ఈ నేపధ్యంలోనే ఇనాయత్ ఆలీ బాక్రీ కాస్త వెనకకు జరగాలని లోధికి చెప్పాడు.

దీంతో కాస్త వెనకకు జరుగగా హోమంత్రి కుమారుడు ఆజం కూడా నేను కూడా జరుగుతా … మీరే నిలబడండి అంటూ వెనక్కి వెళ్లి పోవడంతో స్పందించిన ఇనాయత్ ఆలీ బాక్రీ వెళ్లాళ్సింది మీరు కాదని… సల్లాఉద్దీన్ లోధి అంటూ దుర్భాషలాడుతూ, వెనక్కి పో అని బెదిరించాడు. వెంటనే నేను ఎందుకు పోవాలని లోధి ప్రశ్నించగా ఆగ్రహించిన ఇనాయత్ ఆలీ బాక్రీ లోధిపై మోచేతితో చాతిలో కొట్టాడు. కింద పడబోయిన లోధిని పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సర్ది చెప్పారు. కార్యక్రమంలో ఎలాంటి గొడవ వద్దని, ఏదైనా ఉంటే ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని లోధికి హోంమంత్రి కుమారుడు ఆజం సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గినట్టు సమాచారం.  కాసేపటికే అక్కడికి చేరుకున్న  హోంమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దమణిగింది కానీ వర్గ పోరు మాత్రం తారా స్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.