A place where you need to follow for what happening in world cup

మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

విద్యార్దులను ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్ నేతల పిర్యాదు
హైదరాబాద్:కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమీషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి,జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి,ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి ,ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి,అధికార ప్రతినిధులు సంధ్యారెడ్డి, అయోధ్య రెడ్డి,  లింగం యాదవ్, వచన్ కుమార్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మొక్కలు చనిపోతున్నాయని చర్యలు తీసుకుంటున్న కలెక్టర్లు చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, సర్పంచులు 15 రోజుల పాటు పిల్లలను ఇబ్బంది పెట్టి కేటీఆర్ అనే పదం వచ్చే విధంగా కింద కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా చదువుతారు. చొప్పదండిలో చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ను కలిశాము. నేషనల్ చిల్డ్రన్స్ కమీషన్ కు సైతం లేఖ రాస్తామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.