A place where you need to follow for what happening in world cup

జనసేనతోనే మార్పు సాధ్యం …నియోజకవర్గ ఇంచార్జ్ పృథ్వి

జనసేన పార్టీతోనే రాజకీయ మార్పు సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఘనపూర్ (స్టే) నియోజకవర్గం నుండి జనసేన బరిలో ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం అధినేత పవన్ కళ్యాణ్ యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్నికల బరిలో దింపుతున్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పట్ల పోరాడమన్నారు. విద్యార్థి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామన్నారు.

డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్, అమరవీరుల స్తూపం మంజూరులో జనసేన పోరాట పాత్ర ఉందన్నారు.యువత అండదండలతో ఎన్నికల్లో జనసేన జండా ఎగరవేస్తామని వ్యాఖ్యనించారు. పాలకుల అసమర్థత వల్ల నియోజకవర్గం అభివృద్ధికీ ఆమడదూరంలో ఉన్నదని ఏద్దేవా చేశారు. ప్రజలు తరపున జనసేన పోరాడుతుందన్నారు. వారం రోజుల్లో ‘జనంలోకి జనసేన’ నినాదంతో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ రజాక్, అక్కెనపెల్లి సాయి, మునిగాల పవన్,పోలె ప్రశాంత్,వినయ్, సమ్మయ్య, బన్నీ, వినోద్, విశాల్, అసిఫ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.