A place where you need to follow for what happening in world cup

జిల్లాలపై బీఆర్ఎస్ దృష్టి

అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పదికి పది స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు అర్జెంటుగా వచ్చి నన్ను కలవాలని కబురు పంపారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రేస్ గూటికి చేరిన పొంగులేటి అక్కడ బలమైన నేత. కాంగ్రేస్ పార్టీకి మంచి పట్టు ఉంది. పొత్తు లేదని డిక్లేర్ కావడంతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఓవైపు కాంగ్రేస్, మరో వైపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కు పట్టు లేదనే చెప్పాలి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావ్ పాలేరు సీటు ఆశించి భంగ పడ్డారు. తెలుగు దేశం పార్టీలో అత్యంత బలమైన నేతల్లో తుమ్మల ఒకరు.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ మాటలకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరారు. ఏరు దాటక ముందు వీర మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం కేసీఆర్.  గత ఎన్నికలలో  ఖమ్మం జిల్లాలో కేవల ఒకే ఒక స్థానం  గెలుచుకున్న కారు పార్టీ  జిల్లాలో 10 స్థానాలు గెల్చుకోవడం సందేహాస్పదమే. ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వర రావ్ చేపట్టిన బల ప్రదర్శన బిఆర్ఎస్ కు ముచ్చెమటలు పుట్టిస్తోంది. గులాబీ జెండాలు లేకుండానే ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో బలమైన నేత చేజారిపోవడం ఖాయమని తెలుస్తోంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మరో సమాచారం. తుమ్మల పార్టీ వీడితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతలు ఆయా పార్టీలో చేరే సమయంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పొంగులేటి చేరిన సమయంలో కాంగ్రేస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మరో వైపు తెలంగాణపై  బిజెపి కూడా పూర్తి ఫోకస్ పెట్టింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో బిజెపి అధిష్టానం దూకుడు పెంచింది. కేసీఆర్ అహంకారం దిగిపోవాలంటే ఈ  సారి బీఆర్ఎస్  మళ్లీ అధికారంలో రావొద్దని తెలంగాణ బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పిలుపునిస్తున్నారు. కేసీఆర్ పోటీ చేయబోయే గజ్వేల్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ కు జిల్లాలోని అన్నిస్థానాలను గల్లంతు చేయాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే కేసీఆర్ తల బొప్పికట్టేట్టు ఉంది. నో డౌట్.

Leave A Reply

Your email address will not be published.