- తెలంగాణ ఉద్యమ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్కు కార్పోరేషన్ పదవి..?
- ఎన్నికల నోటీఫీకేషన్ తో మిట్టపల్లి పదవికి తాత్కాలిక బ్రేక్
- మిట్టపల్లి సురేందర్కు రాష్ట్ర స్థాయి పదవి కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు సుముఖం
- తెరవెనక చక్రం తిప్పిన బాల్క సుమన్.. అంతలోనే ఎన్నికల నోటీఫీకేషన్
పార్టీ కోసం పని చేయండి నేనున్న ఏపూరి సోమన్నకు, మిట్టపల్లి సురేందర్కు మంత్రి కేటీఆర్ సూచన
సిరిసిల్ల హెలిక్యాప్టర్ ప్రయాణం గాలిలోనే దశ తిరిగే సమయంలో ఎన్నికల షెడ్యూల్ తెలంగాణ ఉద్యమ పాట రచయిత, ప్రముఖ సీని గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ రాష్ట్ర స్థాయి పదవికి ఎన్నకల షెడ్యూల్ తో బ్రేక్ పడినట్లు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ అవిర్బావం నుంచి బీఆర్ఎస్ వరకు మిట్టపల్లి సురేందర్ పార్టీకి సేవలు అందించడమే కాకుండా అనేక పాటలు రాసి, పాడి తెలంగాణా ప్రజల మన్ననలు పొందారు. అనేక అవార్డులు అందుకున్నారు. తెలంగాణా నుంచి సీని ఇండస్ట్రీలో సైతం రాణిస్తున్నారు. ఉద్యమ గాయకుడు సాయిచంద్ మరణం తర్వాత బీఆర్ఎస్కు ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు పాటలు పాడే గాయకులు లేకుండా పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్, ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ లు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా గళం విప్పుతున్న ఏపూరి సోమన్నతో చర్చలు జరిపి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
ఎన్నికల సమయంలో ధూం ధాం వేదికలకు ఇన్చార్జీగా ఇస్తామన్న కమిట్మెంట్, భౌవిష్యత్ మంచి రాజకీయ భౌవిష్యత్ ఉంటుందని మంత్రి కేటీఆర్ హమీ ఇప్పించి పార్టీలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే ప్రముఖ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ అలకబూనడంతో.. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కల్పించుకోని సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్రావు, కేటీఆర్ దృష్టికి మిట్టపల్లి సురేందర్ విషయం తీసుకెళ్లడంతో రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపూరి సోమన్న జాయినింగ్ రోజు మంత్రి కేటీఆర్ కానీ, ఎంఎల్సీ కవిత కానీ హజరుకాకపోవడంతో కాస్తా అనుమానంతో ఉన్న ఏపూరి సోమన్నను, మిట్టపల్లి సురేందర్ ను బాల్క సుమన్ సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ను కల్పించినట్లు సమాచారం.
అనుకోకుండా మంత్రి కేటీఆర్ వీరద్దరిని హెలిక్యాప్టర్ లో ఎక్కించుకోని గాలిలోనే వారి భౌవిష్యత్ భరోసాను మంత్రి కేటీఆర్ ఇచ్చినట్లు తెలిసింది. మిట్టపల్లి సురేందర్కు రాష్ట్ర స్థాయి పదవి ఎన్నికలకు ముందే ఇస్తామని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగులేకపోవడంతో రెండు మూడు రోజుల్లో ఉత్వర్వులు ఇచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ హమీతో ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ లు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 10నుంచి 13 లోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంచానా వేయగా కేంద్ర ఎన్నికల కమీషన్ సోమవారమే ఎన్నికల నోటీపీకేషన్ వేయడంతో కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే.. మొదటి విడతలోనే వేములవాడ బీఆర్ఎస్ నేత ఎనుగు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి సురేందర్కు కార్పోరేషన్ పదవులు వస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు.
ఫోటో:
మంత్రి కేటీఆర్ తో కవి, గాయకులు మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న
మిట్టపల్లి సురేందర్.కవి గాయకుడు
సిఎం కేసీఆర్ తో కవి గాయకులు మిట్టపల్లి సురేందర్, సాయిచంద్(ఫైల్)