- ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆలోచన ఆర్యవైశ్యులకు ఎక్కువ
- జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య
ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సమాజ సేవలో ముందు ఉంటారని సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో కలకోట వారి రికాన్ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమ నరసయ్య మాట్లాడుతూ ఆర్య వైశ్యులు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవారంగంలోనూ ముందుంటారని కొనియాడారు. తను సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పేదవారికి సహాయం చేయాలని ఆలోచన ఎక్కువగా ఆర్యవైశ్యుల్లోనే ముందుంటారని తెలిపారు.
ఆర్యవైశ్యులు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి తమ వంతు సహకారాన్ని పేద ప్రజలకు అందించడం అభినందనీమన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్యులు జిల్లాలో సేవా రంగంలో ముందున్నారని కొనియాడారు.పేద ప్రజలకు సహాయం అందించడంలో తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందు వరుసలో ఉండి చేతికి ఎముక లేని దాతగా అందరికీ ఆపద్బాంధవుడిగా ఆదుకునే సోమ నరసయ్య దానగుణాన్ని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, సుధా బ్యాంకు చైర్మన్ సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్, అనంతుల ప్రభాకర్, మీలా వాసుదేవ్, గోపారపు రాజు, దేవరశెట్టి సత్యనారాయణ, చల్లా లక్ష్మీకాంత్, రాచకొండ శ్రీనివాస్, సింగిరి కొండ రవీందర్, బండారు సత్యనారాయణ, రుద్రంగి రవిశశి, సవరాల సత్యనారాయణ, గుండా శ్రీదేవి, మీలా వంశీ, వాసవియన్స్ కలకోట లక్ష్మయ్య, వంగవీటి గురునాథం,వెంపటి శబరి, బెలిదే శ్రీనివాసు,బజ్జురి శ్రీనివాసు, కలకోట అనిత, మీలా వీరమని, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ , గుండా మురళి, కోటగిరి రామకృష్ణ,తల్లాడ సోమయ్య, దేవరశెట్టి సత్యనారాయణ గోపారపు రాజు తల్లాడ చందన్ చంద్రశేఖర్ రవి మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.