భారతీయ జనతా యువ మోచ్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరుద్యోగ భృతి & గ్రూప్2 పరీక్ష వాయిదా పై కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా” జరిగింది. లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను 3 నెలల సమయం ఇచ్చి తరువాత పరీక్ష నిర్వహించాలి. ఎన్నికల్లో యువతకు ప్రతినెలా చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ప్రతినెలా 3,016, ఇప్పటివరకు 56 నెలల మొత్తం 1,68,896 రూపాయల మొత్తాన్ని వెంటనే చెల్లించాలి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షల, నియమాలను తప్పుల తడక మార్చి నిరుద్యోగుల, యువకుల తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిన టీఎస్పిఎస్సీ C చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరీంత ఉదృతం చేస్తామని, నిరసనలతో పాటు సెక్రటేరియట్, ప్రగతిభవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.