A place where you need to follow for what happening in world cup

బాలయ్య.. ఇక ఫుల్ చార్జ్…

0 81

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శ యాత్ర చేస్తానని కూడా ప్రకటించేశారు. చంద్రబాబు అరెస్ట్‌ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను, పోలీస్ లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడ్డవారిని పరామర్శించాలన్నది ఆ యాత్ర లక్ష్యం. బాలయ్య చాలా ఏళ్ల నుంచి పాలిటిక్స్‌లోనే ఉంటున్నా… సందర్భం వచ్చినప్పుడు తప్ప పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. మీటింగ్స్‌ ఉంటే హాజరవడం, నియోజకవర్గ పనులు చూసుకోవడం వరకే పరిమితం అయ్యారాయన. కానీ.. ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా మారిపోయారు బాలకృష్ణ. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన దగ్గరి నుంచి పూర్తి స్థాయి పొలిటికల్‌ లీడర్‌ రోల్‌లోకి వెళ్ళిపోయారు. అరెస్ట్‌ను నిరసిస్తూ.. టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడం, దానికి సంబంధించిన వ్యవహాలాను టీడీపీ హెడ్డాఫీస్‌ నుంచి సమీక్షించడం లాంటి పనుల్లో మునిగిపోయారు.

మామూలుగా అయితే అక్కడికి చాలా అరుదుగా వెళ్తుంటారాయన. ముఖ్యమైన సమావేశాలుంటే రావడం, పని చూసుకుని వెళ్లడం వరకే పరిమితం అయ్యేవారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే.. అసలు కొన్ని జిల్లాలకు అధ్యక్షులెవరో తెలిసి ఉండకపోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా పార్టీ వ్యవహారాల పర్యవేక్షణలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌ అవడం, లోకేష్‌ కూడా రాజమండ్రిలోనే ఉండటం లాంటి పరిణామాలతో… పార్టీకి అంతా తానై.. కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారట బాలయ్య. ఇన్నేళ్ళలో తొలిసారి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. అది కూడా… సెంటర్‌ సీట్లో కూర్చుని మాట్లాడటం ఆసక్తి రేపుతోంది.ఎన్టీయార్‌ వారసుడిగా ఆయనకా ప్రివిలేజ్‌ ఉంటుందని అంటున్నాయి పార్టీ వర్గాలు.

మరోవైపు లోకేష్‌ని కూడా అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో.. బాలయ్య లీడ్‌ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బాలకృష్ణ చేసిన తాజా కామెంట్స్‌ కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. పరామర్శ యాత్రను ప్రకటించడంతోపాటు అండగా నేను ఉంటానని కేడర్‌కు డైరెక్ట్‌గా సందేశం ఇచ్చారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో ఒకవేళ చంద్రబాబు, లోకేష్‌ అందుబాటులో లేకుంటే… ఇక టీడీపీ వ్యవహారాలను తానే చూసుకుంటాను… డోంట్‌వర్రీ అని కార్యకర్తలకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. అంటే… ఎట్నుంచి ఎటు చూసినా… టీడీపీలో ఇక బాలయ్య కీలకం కాబోతున్నారన్నది క్లియర్‌ అంటున్నాయి రాజకీయ వర్గాలు.

తొలి నుంచి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నా…. 2009, 2014, 2019 ఎన్నికల్లో మాత్రం ఫుల్‌టైం, సీరియస్‌గా కేంపెయిన్‌ చేశారు బాలయ్య. అలాగే… 2014, 2019లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు.అప్పుడెప్పుడూ పార్టీ పరంగా ఈ స్థాయిలో ఆయన జోక్యం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే సీనియర్స్‌తో వరుస మీటింగ్స్‌, సమీక్షలతో పూర్తిస్థాయి పొలిటీషియన్‌గా బిజీ అయ్యారాయన. మొత్తంగా చూస్తే… పరిస్థితులు ఎట్నుంచి ఎటు మారినా సరే… బాబు, లోకేష్‌ అందుబాటులో ఉన్నా… లేకున్నా… పార్టీకి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు టీడీపీ నాయకులు. వాళ్ళిద్దరి గైడెన్స్‌లోనే అంతా నడుస్తోందని చెప్పుకోవడం కొసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.