- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
- బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ నాయకుల ఆగ్రహం
- షాద్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో
- పార్టీ నేతలు అరెస్ట్
ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయడం.. దీక్షలను భంగం చేయడం లాంటి తప్పుడు పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేవి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు అని, నిరుద్యోగులకు ఉద్యోగలు,ప్రజల కు ప్రధానమంత్రి అవస్ యోజన క్రింద ఇండ్లు ,రైతులకు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని అని అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
కేంద్రమంత్రి బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం కేసీఆర్ నిజాం కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్షాలను అణచివేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్షమ మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం పథకం ప్రకారమే నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని కేసీఆర్ చేతగాని తనం వల్లే పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేస్తున్నారు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలను పోలీసుల ద్వారా కట్టడి చేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాపై బిజెపి సీనియర్ నేతలు కక్కునూరు వెంకటేష్ గుప్తా,పాతపల్లి కృష్ణ రెడ్డి మల్చాలం మురళి, వంశీకృష్ణ ఎంకనోల్ల వెంకటేష్ ,ముకుందాం,దొడల వెంకటేష్ యాదవ్,పిట్టల సురేష్, తదితరులను బలవంతంగా ఎస్సై శరత్ అదుపులోకి తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు..